రాధేశ్యామ్ లో హీరో హీరోయిన్లు లేకుండానే రోమాంటిక్ సాంగ్

రాధేశ్యామ్ లో హీరో హీరోయిన్లు లేకుండానే రోమాంటిక్ సాంగ్

పాన్ ఇండియా సినిమా అనగానే మొదట గుర్తొచ్చేది ప్రభాస్. ఇప్పటికే ఐదు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బిజీగా ఉన్నాడు తను. వాటిలో ‘రాధేశ్యామ్’ రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి రెడీగా ఉంది. ఆదిపురుష్, సాలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ చిత్రాలు మేకింగ్ దశలో ఉన్నాయి. ఇంతలోనే మరో మూడు ప్రాజెక్టులకు తను గ్రీన్ సిగ్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడనే వార్త వైరల్ అవుతోంది. బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే సినిమా చాలా రోజులుగా వార్తల్లో ఉంది. ఇక ఇప్పుడు ఫన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి కేరాఫ్ అయిన మారుతితోనూ ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇది ఓ హారర్ కాన్సెప్ట్ అని, డీవీవీ దానయ్య నిర్మిస్తారని, రాజా డీలక్స్ అనే టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని పరిశీలిస్తున్నారని అంటున్నారు. మారుతి ఈ వార్తలపై రియాక్టయ్యాడు. అయితే తన ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనని, టైమ్ వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయని అన్నాడే తప్ప ఆ వార్తలన్నీ అబద్ధమని కొట్టి పారేయక పోవడంతో ఈ న్యూస్ నిజమయ్యే చాన్స్ ఉందంటున్నారంతా. ఇక మరో మూవీ దిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజు బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేయనున్నాడని, మొత్తం ఎనిమిది సినిమాలతో తన ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఫుల్ ఫీస్ట్ ఇస్తాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇదే కనుక నిజమైతే మరో మూడు, నాలుగేళ్ల వరకు ప్రభాస్ డైరీ ఫుల్లైపోయినట్టే. ఇక ‘రాధేశ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ మార్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెలలో ఈ మూవీ రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించి కూడా ఒక ఇంటరెస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యూస్ తెలిసింది. ఇందులో ఓ రొమాంటిక్ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉందట. దీన్ని హీరో హీరోయిన్లు లేకుండానే వీఎఫ్ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తీశారట. ఆ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పూజ వేరే మూవీస్​తో బిజీగా ఉండి ఆమె కాల్షీట్స్ దొరక్కపోవడంతో తన డూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో,  సీజీ వర్క్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మేనేజ్ చేసినట్లు తెలుస్తోంది.