
గ్లోబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ ఎదురుచూపులు ఎండ్ కార్డు పడింది. ది ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ మూవీ సలార్(Salaar) రిలీజ్ పై క్లారిటీ వచ్చేసింది. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
?????? ?????? ????!#SalaarCeaseFire Worldwide Release On Dec 22, 2023.#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms #VijayKiragandur @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur @shivakumarart @vchalapathi_art @anbariv… pic.twitter.com/IU2A7Pvbzw
— Hombale Films (@hombalefilms) September 29, 2023
ఈ సినిమాను డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన టీజర్‌లో ప్రభాస్ మోస్ట్ వయొలెంట్ లుక్ లో కనిపించడంతో.. ఆయన ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా.. డిసెంబర్ 22 నుంచి డైనోసార్ వేట మొదలవుతుందని సంబరపడుతున్నారు. ఇక వచ్చే నెల నుండి వరుసగా అప్డేట్స్, ప్రమోషన్స్ కార్యక్రమాలు మొదలు కానున్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.