
ప్రభాస్ నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ‘సాలార్’ కూడా ఒకటి. ‘కేజీయఫ్’ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో భారీ యాక్షన్ షెడ్యూల్‌ను షూట్ చేస్తున్నారు. దీనికోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్‌ను రంగంలోకి దింపాడట ప్రశాంత్ నీల్. వాళ్లు డిజైన్ చేసిన సాలిడ్ యాక్షన్ సీన్స్ హైలైట్‌గా నిలుస్తాయంటున్నారు. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు విలన్ పాత్ర పోషిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ప్రశాంత్ నీల్ విజన్‌కు, ఆయన సినిమాను తెరకెక్కిస్తున్న తీరుకు ఫిదా అయ్యానని చెప్పుకొచ్చాడు. ఇందులోని యాక్షన్ బ్లాక్స్ ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఉంటాయని ఊరిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతిబాబు, శ్రియా రెడ్డి కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. హాంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న సినిమా విడుదల కానుంది.