బ్యాక్ టు బ్యాక్ సినిమాలు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రిలీజ్

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రిలీజ్

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌‌లో జోష్‌‌ని నింపుతున్నాడు ప్రభాస్. పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న  యంగ్ రెబల్ స్టార్.. ఒక్కో చిత్రాన్ని పూర్తి చేస్తూ పర్ఫెక్ట్ ప్లానింగ్‌‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.  ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల్లో మరో మూవీని మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా చేయాల్సి ఉంది. రీసెంట్‌‌గా సందీప్ ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాడని తెలుస్తోంది. 

డిసెంబర్‌‌‌‌లో సినిమా సెట్స్‌‌కి వెళ్లబోతోందట. దీనికోసం ప్రభాస్ కూడా కాల్షీట్లు ఇవ్వడానికి రెడీ అయ్యాడట. మొత్తం షూటింగ్‌‌ను ఆరు నెలల్లోనే కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు టాక్. వచ్చే ఏడాదికి సినిమాను పూర్తి చేసి, 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ నెలాఖరుకు ‘సాలార్‌‌‌‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. అనుకోని కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. 

అయితే ఈ చిత్రాన్ని నవంబర్ 10న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. మరోవైపు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న భారీ ప్రాజెక్ట్‌‌ ‘కల్కి’ సంక్రాంతికి రాబోతోందని ఇప్పటికే ప్రకటించారు.  వీటితో పాటు మారుతి డైరెక్షన్‌‌లో ప్రభాస్ నటిస్తోన్న సినిమా చివరి దశకు చేరుకుందని, త్వరలోనే ఈ మూవీ గురించిన అఫీషియల్ అనౌన్స్‌‌మెంట్ వచ్చే చాన్స్ ఉందని తెలుస్తోంది.