దీపావళికి ప్రభాస్ సాలార్ రిలీజ్ ! 

దీపావళికి ప్రభాస్ సాలార్ రిలీజ్ ! 

ప్రభాస్‌‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘సాలార్‌‌‌‌’. ప్రశాంత్ నీల్‌‌ దర్శకత్వంలో హోంబలే సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌‌ అయిన ‘సీజ్‌‌ ఫైర్‌‌‌‌’ సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉంది. అయితే సినిమా వాయిదా పడబోతోందని గత కొద్ది వారాలుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్నే నిజం చేస్తూ రిలీజ్ డేట్‌‌ విషయంలో స్పందించారు మేకర్స్. సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు బుధవారం హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. ‘సాలార్‌‌‌‌ సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ముందుగా ప్రకటించిన డేట్‌‌కి కాకుండా వాయిదా వేస్తున్నాం.

అద్భుతమైన సినిమాటిక్స్ ఎక్స్‌‌పీరియన్స్‌‌ను అందించడానికి కట్టుబడి ఉన్నాం. కనుక ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకోండి. హయ్యెస్ట్‌‌ స్టాండర్డ్స్‌‌లో సినిమాను తీసుకొచ్చేందుకు మా టీమ్ విశ్రాంతి లేకుండా పనిచేస్తోంది. కొత్త రిలీజ్ డేట్‌‌ని త్వరలో వెల్లడిస్తాం’ అంటూ సోషల్ మీడియా ద్వారా చెప్పారు మేకర్స్. దీపావళి సందర్భంగా నవంబర్‌‌‌‌ 10న లేదంటే నవంబర్ 24న సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  శ్రుతిహాసన్ హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనాక్షి చౌదరి, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.