
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ సలార్(Salaar). కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం డార్లింగ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి రిలీజైన టీజర్ కు ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ టీజర్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ సాధించింది. దీంతో హైయెస్ట్ వ్యూస్ సాధించిన ఇండియాన టీజర్ గా సలార్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.
ఇక టీజర్ కు వస్తున్న ట్రెమండ్రస్ రెస్పాన్స్ రావడంతో.. ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక నోట్ రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాదు.. ఈ నోట్ లో సలార్ ట్రైలర్(Salaar trailer) కు సంబంధించిన హింట్ కూడా ఇచ్చారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఈ నోట్ లో మేకర్స్.. " సలార్ టీజర్ పై ప్రేక్షకులు చూపించిన ప్రేమాభిమానాలకు మా కృతజ్ఞతలు. ఈ టీజర్ సృష్టించిన ప్రభంజనంలో మాపై మీరు చూపిన ప్రేమ, అభిమానానికి రుణపడి ఉంటాము. భారతీయ సినిమా పరాక్రమానికి ఇది ఒక ప్రతీక. మీ క్యాలెండర్లో ఆగస్టు నెలను మార్క్ చేసి పెట్టుకోండి. భారతీయ సినిమా వైభవాన్ని చాటి చెప్పే అత్యంత శక్తివంతమైన ట్రైలర్ వస్తోంది.. సిద్ధంగా ఉండండి" అంటూ తెలిపారు. దీనికి #SALAARREVOLUTION, #100MILLIONVIEWS అనే హ్యాష్ ట్యాగ్స్ ను కూడా జతచేశారు.
మేకర్స్ ఇచ్చిన ఈ అప్డేట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్ గత మూడు సినిమాలో బాక్సాఫీస్ దగ్గర సరిగా ఆడకపోవడంతో.. సలార్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా.. సలార్ ను హై బడ్జెట్ తో రోపొందిస్తున్నారు. మరి సలార్ సినిమా ప్రభాస్ అభిమానుల అంచనాలను అందుకుంటుందా అనేది చూడాలి.
100 Million Views and we're feeling dino-mite!
— Hombale Films (@hombalefilms) July 8, 2023
Thank you all for being part of this incredible milestone. Your support means the world to us ??#SalaarTeaser100MViews#SalaarCeaseFire ▶️ https://t.co/KAGJyVxqga#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan… pic.twitter.com/cbdOUdZjkw