
పాన్ ఇండియా హీరో ప్రభాస్ వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. రాజాసాబ్ చేస్తూనే, హనురాఘవ పూడితో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, సలార్ పార్ట్ 2 లైన్ లో ఇలా క్రేజీ లైనప్ తో ఉన్నాడు. అయితే, ఇందులో డార్లింగ్ అప్ కమింగ్ రిలీజ్ మూవీ మాత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab).
మారుతి తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఊరిస్తూ వస్తోంది. ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్ సినిమా చేస్తుండటంతో సినిమా భారీ హైప్ ఉంది. కానీ, సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వస్తుండటంతో ఫ్యాన్స్ డిస్సప్పాయింట్ అవుతున్నారు. అయితే, ఇపుడీ రాజాసాబ్ మరింత దూరం వెళ్లినట్లు తెలుస్తోంది.
లేటెస్ట్గా ‘మిరాయ్’ రిలీజ్ సందర్భంగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్.. రాజాసాబ్ సినిమా విశేషాల పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ది రాజాసాబ్’ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న వస్తుంది. అక్టోబర్ 2న ట్రైలర్ రిలీజ్ కానుంది. ‘కాంతార చాప్టర్ 1’ రిలీజ్ అయ్యే థియేటర్స్‌లో ట్రైలర్ ప్రదర్శించబోతున్నాం. అలాగే ప్రభాస్ బర్త్ డేకు (అక్టోబర్ 22)న ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు’’ రాజాసాబ్ నిర్మాత వివరాలు వెల్లడించారు.
ఈ క్రమంలో డిసెంబర్ 5, 2025న థియేటర్లలోకి రావాల్సిన డార్లింగ్.. పొంగల్ బరిలో నిలువనున్నట్లు క్లారిటీ వచ్చేసేంది. అయితే, ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. ఈ కొత్త రిలీజ్ డేట్తో డార్లింగ్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు.
►ALSO READ | చిక్కుల్లో నయనతార.. రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తూ కేసు పెట్టిన ఏబీ ఇంటర్నేషనల్!
వాస్తవానికి ఏప్రిల్ 10న తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కానీ కొంత భాగం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ ఉండటంతో రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు. దీంతో జూలై 18 రిలీజ్ అని టాక్ ఉండే. అది కూడా దాటేసి, డిసెంబర్ 5 అన్నారు. ఇపుడు అది కూడా దాటేసి జనవరి 9 అంటున్నారు. ఇదైనా కన్ఫర్మా? లేక మారుతుందా? అనే మేకర్స్ ను ట్యాగ్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా ‘ది రాజా సాబ్’ నుంచి ట్రైలర్, ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఐతే వచ్చింది.