
ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్ (TheRajaSaab). నేడు (జూన్ 3న) రాజాసాబ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మేకర్స్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు. డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న ఈ హార్రర్ కామెడీ మూవీ.. 2025 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ తెలిపారు.
A day that promises a festival on the big screens just like we all dreamt of seeing our dearest darling #Prabhas ❤️❤️❤️
— Director Maruthi (@DirectorMaruthi) June 3, 2025
A lot more exciting days ahead…#TheRajaSaab pic.twitter.com/PFdV1mcqDJ
ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ పవర్ ఫుల్గా ఉంది. ఇప్పటివరకు వచ్చిన ప్రతి పోస్టర్ దేనికదే డిఫరెంట్ అనే విధంగా ఇంపాక్ట్ పెంచేతున్నాయి. ఈ లేటెస్ట్
పోస్టర్లో కాలుతున్న నోట్ల కట్టల మధ్యలో గంభీరమైన లుక్లో ప్రభాస్ నిల్చున్నాడు. ఇది రెబల్ ఫ్యాన్స్ను వీపరీతంగా ఆకట్టుకునేలా చేసింది
ఇదిలా ఉంటే .. రాజాసాబ్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా రానుంది. ఈ సినిమా టీజర్ జూన్ 6న రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో టీజర్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.
ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రభాస్ లుక్.. ఫస్ట్ గ్లింప్స్, ఈ లేటెస్ట్ పోస్టర్ అంచనాలు పెంచేశాయి. దానికి తోడు ప్రభాస్ తన కెరియర్లో ఫస్ట్ టైం హార్రర్ జోనర్లో సినిమా చేస్తుండటం మరింత క్యూరియాసిటీ తీసుకొచ్చింది.
ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిరి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, రిద్దీకుమార్, యోగి బాబు, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్, వెన్నెల కిషోర్ ఇతర తారాగణంగా ఉన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నఈ మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.