ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న ‘స్పిరిట్’ చిత్రం ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ ముహూర్త వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. ఆదివారం నుంచే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేశారు. పాన్-వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని టీ- సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రభాస్‌కు జంటగా త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజున విడుదల చేసిన ఒక ప్రత్యేకమైన ‘సౌండ్-స్టోరీ’ ఆడియో టీజర్ సినిమాపై బజ్‌ను పెంచింది.
తొమ్మిది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. మరోవైపు ప్రభాస్ హీరోగా మారుతి రూపొందిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రం నుంచి ఆదివారం మొదటిపాట విడుదలైంది. తమన్ కంపోజ్ చేసిన ఈ పాటలో ప్రభాస్ స్టైలిష్‌గా కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తున్నాడు. ‘రాజా.. తేరా శ్వాగ్ సూపర్.. రాజా.. నీ స్టైల్ బంపర్..’ అంటూ కలర్‌ఫుల్‌గా సాగిందీ పాట. హారర్ కామెడీ జానర్‌లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం అని మేకర్స్ చెప్పారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది. ఓ పైపు స్పిరిట్ ప్రారంభోత్సవం, మరోవైపు ‘ది రాజా సాబ్’ సాంగ్‌తో ప్రభాస్ అభిమానులకు డబుల్ ట్రీట్ అందించాడు.
