
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్ .. త్వరలో ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు మారుతి తెరకెక్కిస్తున్న ‘రాజా సాబ్’ చిత్రంలోనూ ప్రభాస్ నటిస్తున్నాడు. వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ‘స్పిరిట్’ చేయాల్సి ఉంది. ఈ మూవీ అనౌన్స్ చేసి చాలా కాలం అవుతున్న నేపథ్యంలో సందీప్ రెడ్డిని ‘స్పిరిట్’ అప్‌డేట్ ఇవ్వాల్సిందిగా చాలామంది కోరుతున్నారు.
ఇటీవల ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సందీప్ రెడ్డి ఈ మూవీ గురించి క్రేజీ అప్‌డేట్‌తో ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ ఏడాది చివర్లో ‘స్పిరిట్’ షూటింగ్ మొదలు కానుందని, ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పుకొచ్చాడు. అలాగే అందరూ అనుకున్నట్టు ఇది హారర్ స్టోరీ కాదని, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథ అని రివీల్ చేశాడు. దీంతో ప్రభాస్‌ను ఫస్ట్ టైమ్ పోలీస్ యూనిఫామ్‌లో చూడొచ్చని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎనిమిది భాషల్లో రూపొందనున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.