Prabhas vs Don Lee : ప్రభాస్‌కు విలన్‌గా కొరియన్ సూపర్‌స్టార్ డాన్ లీ.. ఇంటర్నేషనల్ క్లాష్ ఫిక్స్!

Prabhas vs Don Lee : ప్రభాస్‌కు విలన్‌గా కొరియన్ సూపర్‌స్టార్ డాన్ లీ.. ఇంటర్నేషనల్ క్లాష్ ఫిక్స్!

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి యాక్షన్ డ్రామా ' స్పిరిట్' చిత్రంలో నటిస్తున్నారు . అయితే లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి వచ్చిన అప్డేట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహన్ని నింపుతోంది.  అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ.. ఈ మూవీలో ప్రతి నాయకుడిగా ఎంట్రీ ఇస్తున్నట్లు కన్ఫామ్ అయింది. దీంతో ఇండియన్, కొరియన్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ భారీ కలయిక ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక ముఖ్య ఘట్టంగా నిలవనుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.

ప్రభాస్ కు విలన్ గా డాన్ లీ.

'ట్రైన్ టు బుసన్' (Train to Busan), మార్వెల్ 'ఎటర్నల్స్' (Eternals) వంటి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న చిత్రాలతో డాన్ లీ యాక్షన్ మూవీస్ చూసే ప్రేక్షకులకు సుపరిచితం అయ్యారు. అయితే ఇప్పుడు ఇండియన్ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడం ఇదే తొలిసారి. అదికూడా ఫాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తో కలిసి నటించడం కొత్త హైప్ ను క్రియేట్ చేస్తోంది. ఈ వార్తను కొరియన్ డ్రామా , ఎంటర్‌టైన్‌మెంట్ కమ్యూనిటీ అయిన 'ముకో' (Muko) తన సోషల్ మీడియాలో వెల్లడించింది.

ఈ 'స్పిరిట్' మూవీ డార్క్-టోన్డ్ డిటెక్టివ్ క్రైమ్ డ్రామాగా రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రంలో మా డాంగ్-సియోక్ పాత్ర.. ప్రభాస్ పోషిస్తున్న పాత్రకు పూర్తి భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. దీనిలో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. డాన్ లీ లాంటి అంతర్జాతీయ యాక్షన్ స్టార్ విలన్‌గా వస్తే.. ఇద్దరి మధ్య యాక్షన్ సన్నివేశాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. అయితే దీనిపై మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

వంగా, ప్రభాస్ క్రేజ్

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన 'అర్జున్ రెడ్డి' ,  బ్లాక్‌బస్టర్ 'యానిమల్' చిత్రాల ద్వారా దేశంలోనే కాక, అంతర్జాతీయంగా కూడా సంచలనం సృష్టించారు. 'స్పిరిట్' చిత్రాన్ని భూషణ్ కుమార్ నేతృత్వంలోని టీ- సిరీస్, సందీప్ రెడ్డి వంగా యొక్క భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తుంది. ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన 'సౌండ్ స్టోరీ' ఆడియో టీజర్, సినిమా టోన్ ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతోందో చూపించింది. 

►ALSO READ | Mass Jathara Bookings: ‘మాస్ జాతర’ టికెట్ బుకింగ్స్ ఓపెన్.. 

ఈ భారీ యాక్షన్ డ్రామా 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు మాండరిన్, జపనీస్, కొరియన్ భాషల్లోనూ విడుదల కానుంది. డాన్ లీ రాకతో, 'స్పిరిట్' గ్లోబల్ ప్రాజెక్ట్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.