Mass Jathara Bookings: ‘మాస్ జాతర’ బుకింగ్స్ ఓపెన్.. రవితేజ-శ్రీలీల బాక్సాఫీస్ కాంబో రిపీట్ అయ్యేనా?

Mass Jathara Bookings: ‘మాస్ జాతర’ బుకింగ్స్ ఓపెన్.. రవితేజ-శ్రీలీల బాక్సాఫీస్ కాంబో రిపీట్ అయ్యేనా?

మాస్ రాజా రవితేజ, బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’. మనదే ఇదంతా క్యాప్షన్. రవితేజ కెరీర్‌‌‌‌లో ఇది 75వ చిత్రం. భాను భోగవరపు తెరకెక్కించిన ఈ మూవీ పలు వాయిదాల తర్వాత విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. 

ఈ సందర్భంగా ఇవాళ (అక్టోబర్ 29న) మాస్ జాతర టికెట్స్ బుకింగ్స్ అన్ని ప్లాట్ఫామ్స్లలో ఓపెన్ చేశారు. BookMyShow, District, లేదా ఇతర థియేటర్ వెబ్‌సైట్‌ల ద్వారా మాస్ జాతర టికెట్స్ బుక్ చేసుకోవచ్చని మేకర్స్ తెలిపారు.

‘‘మాస్ జాతర ట్రైలర్, టీజర్, ప్రమోషన్స్కి వస్తున్న రెస్పాన్స్ అదిరిపోయింది. సినీ పరిశ్రమతో పాటుగా, రవితేజ ఫ్యాన్స్, సినీ ఆడియన్స్ నుండి అద్భుతమైన స్పందన వస్తుంది. ఇప్పుడే మీ టిక్కెట్లను బుక్ చేసుకోండి’’ అని మేకర్స్ ట్వీట్ చేశారు. అయితే, ఇప్పటికే, బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ చేయగా.. హాట్ కేకుల్లా బుక్ అవుతున్నాయి.  

ఇందులో రవితేజ పవర్‌‌‌‌ఫుల్ రైల్వే పోలీస్ ఆఫీసర్‌‌‌‌గా కనిపించనున్నాడు. శ్రీలీల స్టూడెంట్ పాత్రలో కనిపిస్తుంది. హీరో శ్రీవిష్ణు బ్లాక్ బస్టర్ సామజవరగమన మూవీకి కథను అందించిన.. కథ రచయిత భాను భోగవరపు.. తన మొదటి సినిమాను రవితేజను డైరెక్ట్ చేయడం మరింత స్పెషల్గా ఉండనుంది. అందుకు తగ్గట్టుగానే సినిమాలో రవితేజను పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా చూపించాడు భాను.

రవితేజ,శ్రీలీల బాక్సాఫీస్ కాంబో:

‘రవితేజ, శ్రీలీల కాంబోలో గతంలో ధమాకా సినిమా వచ్చిన విషయం తెలిసిందే. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి భారీ విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో తెరపై ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి వస్తుండటంతో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే, క్రేజీ సాంగ్స్తో వీరి డ్యాన్స్ వీడియోస్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. ఈ క్రమంలో మాస్ జాతరతో మాస్ దావత్.. మోత మోగిపోద్ది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

►ALSO READ | VishnuVishal: సడెన్గా సినిమా వాయిదా వేసిన స్టార్ హీరో.. కారణమిదే అంటూ నోట్ రిలీజ్

ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, గ్లింప్స్‌‌‌‌‌‌‌‌, టీజర్ సినిమాపై భారీ అంచనాలు తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజై.. ఆడియన్స్లో భీబత్సమైన హైప్ తీసుకొచ్చింది. ఇక వరుస ఫెయిల్యూర్స్లో ఉన్న రవితేజ, శ్రీలీలకు మాస్ జాతర.. ఎలాంటి కిక్ ఇవ్వనుందో తెలియాల్సి ఉంది.