విష్ణు విశాల్ హీరోగా కె ప్రవీణ్ రూపొందించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’. శుభ్ర, ఆర్యన్ రమేష్, విష్ణు విశాల్ కలిసి నిర్మించారు. అక్టోబర్ 31న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే తెలుగు వెర్షన్‌ను వారం రోజులు వాయిదా వేస్తూ నవంబర్ 7న రిలీజ్ చేయనున్నట్టు తెలియజేశారు.
తమిళ వెర్షన్ మాత్రం షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 31నే విడుదల కానుంది. శ్రేష్ట్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో విడుదల చేయనున్నారు. తెలుగు రిలీజ్ వాయిదాకు గల కారణాలను తెలియజేస్తూ విష్ణు విశాల్ ఓ నోట్ విడుదల చేశాడు.
‘డియర్ ఆడియెన్స్. సినిమా అనేది రేస్ కాదు, అది ఒక వేడుకని నేను ఎప్పుడూ నమ్ముతాను. ప్రతి వేడుకకీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం, వెలుగు ఉండాలి. మా చిత్రం ‘ఆర్యన్’ అక్టోబర్ 31న విడుదల కావలసి ఉంది. ఈ ప్రత్యేక తేదీలో రవితేజ గారి ‘మాస్ జాతర’తోపాటు పవర్ ఫుల్ ‘బాహుబలి ది ఎపిక్’ మీ అందరినీ అలరించడానికి రావడంతో మరింత ప్రత్యేకమైనది. రవితేజ గారికి, రాజమౌళి గారికి నేను పెద్ద అభిమానిని. ఈ వారం వారి సినిమాలని సెలబ్రేట్ చేసుకోవడం సరైనదని భావిస్తున్నా. మా చిత్రం వారం తర్వాత అదే ప్యాషన్, థ్రిల్‌తో ప్రేక్షకుల ముందుకొస్తాం’ అని పోస్ట్ చేశాడు.
Dear Telugu audience,#Aaryan (Telugu) will meet you in cinemas one week later, on November 7.
— VISHNU VISHAL - VV (@TheVishnuVishal) October 28, 2025
With love and respect,
Vishnu Vishal. pic.twitter.com/82WiK9p8iG
టీజర్, ట్రైలర్ రెస్పాన్స్:
ఇటీవలే ఆర్యన్ టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఓ హత్య దర్యాప్తుతో విష్ణు విశాల్ పాత్రను ఆసక్తికరంగా పరిచయం చేస్తూ సాగిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను డార్క్ అండ్ ఇంటెన్స్ వరల్డ్‌లోకి తీసుకెళ్లేలా ఉన్నాయి. ఓ సైకో తాను ఎవరిని హత్య చేయబోతున్నాడో గంట ముందు అనౌన్స్ చేసి మరీ మర్డర్ చేస్తుంటాడు. ఆ గంటలోపు అతన్ని పట్టుకోగలగాలి.
పోలీస్ ఆఫీసర్‌గా తనదైన శైలిలో విష్ణు విశాల్ ఆకట్టుకున్నాడు. సైకో క్రిమినల్గా సెల్వరాఘవన్ పాత్ర ఇంటెన్స్ కలిగిస్తుంది. ఈ సైకో చేసేది పర్ఫెక్ట్ క్రైమ్ కాదు.. అతనే పర్ఫెక్ట్ క్రిమినల్ అనే చెప్పే డైలాగ్.. తనలోని మృగాన్ని చూపించేలా ఉంది. ‘రాట్ససన్’ విజయం తర్వాత విష్ణు విశాల్ మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. సినిమా క్లిక్ అయితే, విష్ణు విశాల్కి తెలుగులో మంచి క్యారెక్టర్స్ దక్కే ఛాన్స్ ఉంది. చూడాలి ఏమవుతుందో!
ఈ సినిమాలో సెల్వరాఘవన్తో పాటుగా శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి కీలక పాత్రల్లో నటించగా, సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్ అభిషేక్ జోసెఫ్ జార్జ్ ఇతర పాత్రలు పోషించారు. విష్ణు విశాల్ హీరోగా నటించిన ‘FIR’ చిత్ర దర్శకుడు మను ఆనంద్ ఈ సినిమాకు కో రైటర్‌గా వర్క్ చేయగా, జీబ్రాన్ సంగీతం అందించారు.
