
ఇండియన్ సినీ బాక్సాఫీస్ ను షేక్ చేసి 'కాంతార' చిత్రానికి పీక్వెల్ గా వస్తున్న మూవీ 'కాంతార ఎ లెజెండ్: చాప్టర్ 1'. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాపై ఇప్పటికే అంచానాలు తారా స్థాయికి చేరాయి. థియేటర్లలో విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.
ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్
లేటెస్ట్ గా ఈమూవీ తెలుగు ట్రైలర్ ను రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. దీంతో ఈ ట్రైలర్ క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఈ మూవీ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిషభ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించగా.. హొంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ సారి గట్టిగానే మరో సారి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. రిషభ్ శెట్టి స్క్రీన్ ప్రెజెన్స్, రుక్మిణి వసంత్ అందం ఎలివేట్ అయ్యాయి. విలన్ పాత్రలో గుల్షన్ దేవయ్య ఆకట్టుకునే లా కనిపించారు. రాజులు, యుద్ధాలు , రాజకుమారితో హీరో ప్రేమాయణం సింపుల్‌గా చూపించారు.
విడుదలకు ముందే రికార్డులు..
'కాంతార ఎ లెజెండ్: చాప్టర్ 1' రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీ తెలుగు హక్కులు ఏకంగా 100 కోట్ల రూపాయలకు అమ్ముడై రికార్డు సృష్టించాయి. ఒక డబ్బింగ్ సినిమాకి ఇంత భారీ ధర పలకడం భారతీయ సినీ చరిత్రలోనే ఇదే తొలిసారి. ఓటీటీ డీల్ ఇప్పటికే రూ. 120 కోట్ల మేర జరిగినట్లు సమాచారం. మూడేళ్ల క్రితం విడుదలైన 'కాంతార' చిత్రం దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. కర్ణాటకలోని తుళు సంస్కృతి, సంప్రదాయాలను, భూత కోల, దైవాల అంశాలను రిషబ్ శెట్టి అద్భుతంగా ఆవిష్కరించారు. రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ నేపథ్యంలో, ఈ చిత్రానికి పీక్వెల్ గా వస్తున్న 'కాంతార: చాప్టర్ 1' పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
'కాంతార ఎ లెజెండ్: చాప్టర్ 1' బడ్జెట్ దాని మునుపటి చిత్రానికి ఐదు నుండి ఆరు రెట్లు ఎక్కువగా ఖర్చుతో నిర్మించినట్లు సమాచారం. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు కూడా ఈ సినిమా కోసం పనిచేస్తున్నందున, విజువల్స్ మరింత అద్భుతంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, అత్యున్నత స్థాయి సినిమాటోగ్రఫీతో విడుదలైన టీజర్, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని ఇప్పటికే మరింత పెంచాయి. ఈ చిత్రాన్ని కేవలం భారతదేశంలోనే కాకుండా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇతర దేశాలలో కూడా భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.