ప్రభాస్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. సాలార్ మళ్ళీ వాయిదా?

ప్రభాస్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..  సాలార్ మళ్ళీ వాయిదా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కొంత కాలంగా సరైన హిట్ లేక సతమవుతున్నారు. బాహుబలి(Bahubali) తరువాత ఆయన నుండి వచ్చిన మూడు సినిమాలు ఫ్లాప్స్ గా నిలిచాయి. అంతేకాదు బాహుబలి తరువాత ప్రభాస్ కటౌట్ కి తగ్గ సినిమా కూడా ఇప్పటివరకు రాలేదు. వచ్చినవాటిలో సాహూ(Saaho) సినిమా కాస్త బెటర్ అనిపిస్తుంది. అందుకే ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్(Salaar) సినిమాపైనే బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు ఆయన ఫ్యాన్స్. సలార్ సినిమా రిలీజ్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుంది. టీజర్ లో కూడా ప్రభాస్ నెక్స్ట్ లెవల్లో కనిపించారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.   

ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సెప్టెంబర్ 28 ఎప్పుడు వస్తుంది అంటూ రోజులు లెక్కపెట్టుకుంటున్నారు. అయితే తాజాగా సలార్ రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యిందంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది కూడా డిసెంబర్ కు. ఈ న్యూస్ చూసిన ఆయన ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న సినిమా పోస్ట్ పోన్ అయింది అంటూ వస్తున్న వార్తలతో చాలా డిసప్పాయింట్ అవుతున్నారు.

ఇక మరోపక్క ఈ సినిమా పోస్ట్ పోనే అవడానికి ఛాన్స్ లేదంటూ మరికొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే సలార్ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ మొదలవ్వడానికి రెడీగా ఉన్నాయి. అంతేకాదు.. సెప్టెంబరు 6న సలార్ ట్రైలర్ కూడా  రాబోతుందని అంటున్నారు. మరి ఇలాంటి టైంలో రిలీజ్ పోస్ట్ పోన్ ఎలా కుదురుతుంది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే నిర్మాణ సంస్థ నుండి అధికారిక ప్రకటన రావాల్సిందే.