
విడుదలకు ముందే ప్రభాస్ మూవీ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. క్రేజ్ కి కేరాఫ్ అంటే ప్రభాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాహుబలి సినిమాతో మొదలైన ఆయన రికార్డ్స్ వేట ఇప్పుడు ఆదిపురుష్ వరకు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. రామాయణ గాధ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాంన్స్ వచ్చింది. దీంతో.. ఈ ట్రైలర్ నెట్టింట సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ వ్యూస్ మార్క్‌ని టచ్ చేసింది ఈ ట్రైలర్. దీంతో వరల్డ్ వైడ్‌గా ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు ప్రభాస్.
గ్లోబల్ వైడ్ గా వరుసగా నాలుగు సినిమాల ట్రైలర్స్ 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ఏకైక హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు ప్రభాస్. బాహుబలి2, రాధే శ్యామ్, సాహూ, ఇప్పుడు ఆదిపురుష్.. ఈ నాలుగు సినిమాల ట్రైలర్స్ 100 మిలియన్ వ్యూస్ రాబట్టి కొత్త రికార్డు సెట్ చేశాయి. ప్రభాస్ నుండి వస్తున్న సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలు కూడా ఇదే రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేయడం పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.