
‘లవ్ టుడే’ చిత్రంతో తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. రీసెంట్‌గా ‘డ్రాగన్’ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ‘డ్యూడ్’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెలుగు, తమిళ ద్వి భాషా చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు. కీర్తిశ్వరన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
శనివారం టైటిల్, ఫస్ట్ లుక్‌తో పాటు సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఇంటెన్స్‌గా కనిపిస్తూ మోడర్న్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు ప్రదీప్ రంగనాథన్. ముఖం మీద గాయాలు, చేతిలో మంగళసూత్రం ఉండటం సినిమాపై ఆసక్తిని కలిగించేలా ఉంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. నికేత్ బొమ్మి డీవోపీగా లతా నాయుడు ప్రొడక్షన్ డిజైనర్‌గా భరత్ విక్రమన్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తున్నాడు.