
- పోలవరం అంశంలో చర్చపై అనుమానాలు!
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మరోసారి ప్రగతి మీటింగ్నిర్వహించనున్నారు. ఈ నెల 27న ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రాష్ట్రాలతో వివిధ ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. ఎప్పట్లాగే పోలవరం ప్రాజెక్టును తొలి ఎజెండాగా మీటింగ్‌లో చర్చించనున్నారు. అయితే, గతంలో మే 28న ఒకసారి, జూన్ 25న మరోసారి ప్రగతి మీటింగ్‌ను నిర్వహించినా పోలవరం అంశాన్ని ఎత్తేశారు. ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష చేశారు.
పోలవరం ప్రాజెక్టుతో మన రాష్ట్రంలో ముంపు సమస్య ఉంటుందని, జాయింట్ సర్వే చేయించాలని రాష్ట్ర సర్కారు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే ప్రధానికి ఆ విషయాన్ని వివరించాలని భావించింది. కానీ, రెండు సార్లు మీటింగ్ నుంచి పోలవరం ఎజెండా ఎత్తేయడంతో ఆ అవకాశం రాకుండాపోయింది.
మరి, ఇప్పుడైనా మీటింగ్‌లో పోలవరం అంశాన్ని చర్చిస్తారా.. ఎప్పట్లాగే ఎత్తేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే మీటింగ్‌లో హైదరాబాద్ నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌తో పాటు మరో మూడు అంశాలపైనా చర్చించనున్నట్టు కేంద్రం ఇటీవలే రాష్ట్ర సర్కారుకు సమాచారమిచ్చింది. కాగా, వచ్చే నెల 3న ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ (పీఎంజీ) ప్రాజెక్టులపైనా కేంద్ర కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రపతిభవన్‌లోని కేబినెట్ సెక్రటేరియెట్ కాన్ఫరెన్స్ రూమ్‌లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.