నార్వే చెస్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో గుకేశ్‎కు ప్రజ్ఞానంద చెక్‌‌‌‌‌‌‌‌‌‌

నార్వే చెస్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో గుకేశ్‎కు ప్రజ్ఞానంద చెక్‌‌‌‌‌‌‌‌‌‌

ఓస్లో: ఇండియా గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌. ప్రజ్ఞానంద నార్వే చెస్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో టైటిల్‌‌‌‌‌‌‌‌ దిశగా మరో అడుగు ముందుకేశాడు. గురువారం రాత్రి జరిగిన 9వ రౌండ్‌‌‌‌‌‌‌‌ క్లాసికల్‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌లో ప్రజ్ఞా 34 ఎత్తులతో సహచర గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ డి. గుకేశ్‌‌‌‌‌‌‌‌పై విజయం సాధించాడు. దీంతో మూడు పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. 

ప్రస్తుతం 15 పాయింట్లతో రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ప్రజ్ఞానంద కంటే వెస్లీ సో (అమెరికా,15.5) కేవలం అర పాయింట్‌‌‌‌‌‌‌‌ ముందున్నాడు. ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌ గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ అలీరెజా ఫిరౌజా (14.5) మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు. ఇక నల్ల పావులతో నిమ్జో ఇండియన్ సామిష్‌‌‌‌‌‌‌‌ వేరియేషన్‌‌‌‌‌‌‌‌తో గుకేశ్‌‌‌‌‌‌‌‌ను ఆశ్చర్యపరిచాడు. 14వ ఎత్తు వద్ద ప్రజ్ఞానంద కొత్త వ్యూహాంతో ముందుకు రాగా దీన్ని అడ్డుకునే ప్రయత్నంలో గుకేశ్‌‌‌‌‌‌‌‌ తప్పు చేశాడు.

దాంతో గేమ్‌‌‌‌‌‌‌‌ మొత్తం ప్రజ్ఞా చేతుల్లోకి వచ్చింది. విమెన్స్‌‌‌‌‌‌‌‌ కేటగిరీలో బిబిసార అసౌబయోవా (కజకిస్తాన్‌‌‌‌‌‌‌‌) 16.5 పాయింట్లతో టైటిల్‌‌‌‌‌‌‌‌ను ఖాయం చేసుకుంది. జు జినెర్‌‌‌‌‌‌‌‌ (చైనా, 13)తో జరిగిన గేమ్‌‌‌‌‌‌‌‌లో దివ్య దేశ్‌‌‌‌‌‌‌‌ముఖ్‌‌‌‌‌‌‌‌ (10), జు వెనిజున్‌‌‌‌‌‌‌‌ (చైనా, 10.5)తో జరిగిన గేమ్‌‌‌‌‌‌‌‌లో కోనేరు హంపి (9) ఓటమిపాలయ్యారు.