
టొరంటో : క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద తొలి విజయం సాధించాడు. ఆదివారం జరిగిన మూడో రౌండ్‌లో 45 ఎత్తుల్లో ఇండియాకే చెందిన విదిత్ సంతోష్ ను ఓడించాడు. మరో గేమ్‌లో డి. గుకేశ్.. ఇయాన్ నెపోమినాట్చి (రష్యా) మధ్య జరిగిన గేమ్ డ్రా అయ్యింది. ఈ రౌండ్ తర్వాత గుకేశ్ రెండు, ప్రజ్ఞానంద, విదిత్ చెరో ఒకటిన్నర పాయింట్లతో కొనసాగుతున్నారు.
విమెన్స్ సెక్షన్‌లో ప్రజ్ఞానంద అక్క ఆర్. వైశాలి కూడా బోణీ చేసింది. మూడో రౌండ్‌లో వైశాలి (1.5) నర్గుయెల్ సలిమోవా (బల్గేరియా 1)పై గెలవగా, తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి (1.5).. జొంగై టాన్ (చైనా 2.5)తో జరిగిన గేమ్‌ను డ్రా చేసుకుంది.