ప్రాగ్: వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్.. ప్రాగ్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్‌లో మళ్లీ నిరాశపర్చాడు. మాస్టర్ సెక్షన్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌లో గుకేశ్ 48 ఎత్తుల వద్ద జోర్డాన్ వాన్ ఫారెస్ట్ (హాలెండ్) చేతిలో ఓడాడు. తెల్లపావులతో రుయ్ లోపెజ్ స్ట్రాటజీతో ఆడిన ఫారెస్ట్.. టార్టకోవర్ వేరియేషన్‌తో గుకేశ్‌ను స్టార్టింగ్‌లోనే ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ క్రమంలో బంటును కోల్పోయిన ఇండియన్ ప్లేయర్ సాంకేతిక తప్పిదాలు చేశాడు.
ఫారెస్ట్ ఎలాంటి తప్పులు చేయకుండా ఎండ్ గేమ్‌ను ముగించాడు. అరవింద్ చిదంబరం.. పర్హామ్ మాగ్స్‌దులూ (ఐర్లాండ్)తో జరిగిన గేమ్‌ను 30 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. ఈ రౌండ్ తర్వాత చిదంబరం 1.5, గుకేశ్ ఒక్క పాయింట్‌తో కొనసాగుతున్నారు. చాలెంజర్స్ విభాగంలో దివ్య దేశ్‌ముఖ్ (1).. జినెర్ జు (చైనా) చేతిలో, సూర్యశేఖర గంగూలీ (0.5).. జాచిమ్ నెమెక్ (చెక్)చేతిలో ఓడారు.
