బీజేపీ నేతల మరణాల వెనుక దుష్టశక్తి: ప్రజ్ఞాసింగ్

బీజేపీ నేతల మరణాల వెనుక దుష్టశక్తి: ప్రజ్ఞాసింగ్

భోపాల్: బీజేపీ మాజీ మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ మరణాల వెనుక దుష్టశక్తి ఉందని బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. బీజేపీ నేతలకు హాని కలిగించేలా ప్రతిపక్షాలు ‘మరాక్ శక్తి’ని ప్రయోగిస్తున్నాయని సోమవారం ఆరోపించారు. ఈ మధ్యే చనిపోయిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ, మధ్యప్రదేశ్ మాజీ సీఎం బాబూలాల్ గౌర్​ల సంతాప సభలో ఆమె మాట్లాడారు. తాను లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో ఓ సాధువు.. బీజేపీకి చెడు కాలం ఉందని హెచ్చరించారని, ఆ మాటల్ని అపుడు పెద్దగా పట్టించుకోలేదని గుర్తుచేశారు. ఇప్పుడు జైట్లీ, సుష్మా లాంటి పెద్ద లీడర్లు చనిపోయిన తర్వాత సాధువు చెప్పిన మాటలు నిజమేనని అనుమానం కలుగుతోందన్నారు. మాలెగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రజ్ఞాసింగ్.. బీజేపీ తరఫున ఈ ఏడాది లోక్​సభఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్​పై గెలిచారు.