ప్రజాభవన్లో ప్రజాదర్బార్.. భారీగా తరలివస్తున్న జనం

ప్రజాభవన్లో ప్రజాదర్బార్.. భారీగా తరలివస్తున్న జనం

సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 8న ఉదయం 10 గంటల నుంచి ప్రజా దర్బార్  నిర్వహించనున్నారు. జ్యోతిబాపూలే ప్రజాభవన్ లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు.  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 

ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు  ఇప్పటికే ప్రజాభవన్ కు క్యూ కట్టారు.జిల్లాల నుంచి కూడా బాధితులు ప్రజాభవన్ దగ్గర కు జనం భారీగా చేరుకుంటున్నారు. పంజాగుట్ట నుంచి బేగంపేట వైపు వెళ్లే దారిలో ట్రాఫిక్ జామ్ అయ్యింది.  దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ప్రజాభవన్ కు ఎవరైనా రావొచ్చని.. ఎలాంటి ఆంక్షలు ఉండవని సీఎం రేవంత్ చెప్పారు. 

గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. రోజు ఉదయం పూట ప్రజలను కలిసే వారు.  సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు వీలు లేకుండా పోయింది. మళ్లీ కాంగ్రెస్ ఇన్నాళ్లకు ప్రజాదర్బార్ నిర్వహిస్తోంది. రేవంత్ సీఎం అయ్యాక ఫస్ట్ టైం ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలను విననున్నారు.  మరి ఇవాళ ప్రజాదర్బార్  కార్యక్రమంలో సీఎం ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించనున్నారు. వారు అడిగే సమస్యలకు ఎలా సమాధానం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది.