బాలీవుడ్ లెజెండరీ నటుడు, 'షోలే' స్టార్ ధర్మేంద్ర ఆసుపత్రిలో చేరారు. గత వారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఆయనను ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ కు బంధువులు తరలించారు. అయితే లేటెస్ట్ వస్తున్న సమాచారం ప్రకారం.. 89 ఏళ్ల ఈ సీనియర్ నటుడు ప్రస్తుతం వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ధర్మేంద్ర త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.
అభిమానుల్లో కలవరం..
డిసెంబర్ 8, 2025న 90వ పుట్టినరోజు జరుపుకోబోతున్న ధర్మేంద్ర అస్వస్థత గురైరయ్యారన్న వార్త.. ఆయన అభిమానులను, సినీ పరిశ్రమ వర్గాలను కలవరానికి గురిచేసింది. అయితే, ఆసుపత్రి వర్గాలు, కుటుంబ సన్నిహితులు మాత్రం పరిస్థితి విషమంగా లేదని చెప్పారు. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగానే కొన్ని పరీక్షల కోసం ఆసుపత్రిలో చేర్చారని, ఇది రొటీన్ చెకప్ మాత్రమేనని తెలిపారు.
►ALSO READ | Actor Abhinay: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. 44 ఏళ్లకే నటుడు కన్నుమూత.. మరణానికి కారణమేంటంటే!
ఫిట్ నెస్ గా 'హీ-మ్యాన్'..
ధర్మేంద్రను బాలీవుడ్‌లో ముద్దుగా 'హీ-మ్యాన్' అని పిలుస్తారు. ఆయన ఫిట్‌నెస్‌కు వయసు అడ్డు కాదని ఎప్పుడూ నిరూపిస్తూనే ఉంటారు. ఆసుపత్రిలో చేరడానికి కొద్ది రోజుల ముందు కూడా ధర్మేంద్ర తన ఫిజియోథెరపీ సెషన్ కు సంబంధించిన వీడియోను కూడా అభిమానులతో పంచుకున్నారు.
నిత్యం వర్కౌట్స్ చేస్తూ..
తన ఆరోగ్యం పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. భగవంతుడి ఆశీస్సులతో, నేను ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు కష్టపడుతున్నాను. యోగ, వ్యాయామం, ఇప్పుడు ఫిజియోథెరపీ... అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు, గతంలో ఆయన తన బలమైన కాళ్ల కండరాలను ప్రదర్శిస్తూ.. తనలో సగం వయసున్న యువకులకు కూడా తనతో పోటీపడలేన్నట్లు ఫిజిక్‌ను చూపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిత్యం వర్కౌట్‌లు, ఫిజియోథెరపీ ద్వారా ఆయన ఫిట్‌నెస్ జర్నీ కొనసాగిస్తున్నారు.
వృత్తిలో ఫుల్ బిజీగా..
ధర్మేంద్ర తన తొలి భార్య ప్రకాష్ కౌర్ తో కలిసి ముంబై సమీపంలోని ఖండాలా ఫామ్‌హౌస్‌లో నివసిస్తున్నట్లు ఇటీవల ఆయన చిన్న కుమారుడు, నటుడు బాబీ డియోల్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, ధర్మేంద్ర తన వృత్తిని మాత్రం కొనసాగిస్తున్నారు. త్వరలో ఆయన నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇక్కిస్ (Ikkis)' చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు, యువ నటుడు అగస్త్య నందాతో కలిసి ధర్మేంద్ర నటిస్తున్నారు.
ఈ యుద్ధ డ్రామా సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్,ఆధారంగా తెరకెక్కుతోంది. పరమ వీర చక్ర అందుకున్న అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన అరుణ్ ఖేత్రపాల్ యుద్ధంలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు సెలబ్రిటీలు, ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు దక్కాయి. ఈ క్లిష్ట సమయంలో బాలీవుడ్ 'హీ-మ్యాన్' ధర్మేంద్ర త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.
