Actor Abhinay: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. 44 ఏళ్లకే నటుడు కన్నుమూత.. మరణానికి కారణమేంటంటే!

Actor Abhinay: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. 44 ఏళ్లకే నటుడు కన్నుమూత.. మరణానికి కారణమేంటంటే!

తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటుడు అభినయ్ కింగర్ (Abhinay Kinger) కన్నుమూశారు. కొన్నేళ్లుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అభినయ్.. ఈ ఉదయం (2025 నవంబర్ 10న) చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. అభినయ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు.

అభినయ్కి ఏమైందంటే:

నటుడు అభినయ్ ఇటీవలే ఓ వీడియో రిలీజ్ చేసి తన వ్యాధికి సంబంధించిన వార్త పంచుకుని ఎమోషనల్ అయ్యారు. తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వీడియో ద్వారా తెలిపారు."నేను ఎక్కువ కాలం ఉంటానో లేదో నాకు తెలియదు" అని వీడియోలో చెప్పుకొచ్చాడు. అలాగే, ఈ దీర్ఘకాలిక కాలేయ వ్యాధి.. రోజులు ఎక్కువయ్యే కొద్దీ.. అంటే చివరి దశగా 'లివర్ సిర్రోసిస్' గా మార్పు చెందినట్లు తెలిపారు. అలా తన ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. చికిత్స కోసం రూ.28 లక్షలు అవసరమంటూ సాయం కోరారు అభినయ్. ఆ వెంటనే తన సహనటులు ధనుష్, హాస్యనటుడు కేపీవై బాలా సాయం చేశారు. కానీ, పరిస్థితి విషమించడంతో అభినయ్ 44 ఏళ్ళ వయస్సులోనే మరణించి విషాదం మిగిల్చారు. 

అభినయ్ సినీ ప్రస్థానం:

2002లో ధనుష్‌ నటించిన ‘తుళ్లువదో ఇళమై’ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ధనుష్కి ఫ్రెండ్గా నటించి మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత అభినయ్ వరుస సినిమాల్లో నటించి రాణించారు. అందులో ‘అరుముగ్’, ‘ఆరోహణం’, ‘సక్సెస్’ లాంటి పలు చిత్రాల్లో నటించి అభినయ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చివరిసారిగా ‘వల్లవనుక్కు పుల్లుం ఆయుధం’ అనే చిత్రంలో కనిపించారు. విజయ్ ‘తుపాకి’, సూర్య ‘అంజాన్’ చిత్రాల్లో విద్యుత్ జమ్వాల్ పాత్రకు డబ్బింగ్ చెప్పారు.