వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 2, 5 కే రన్ కార్యక్రమాలు...ఆరోగ్యం కోసం వ్యాయామం తప్పనిసరి

వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 2, 5 కే రన్ కార్యక్రమాలు...ఆరోగ్యం కోసం వ్యాయామం తప్పనిసరి

ఆరోగ్యం కోసం ప్రతి రోజూ వ్యాయం తప్పనిసరిగా చేయాలని ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 2, 5 కే రన్​కార్యక్రమాలు నిర్వహించారు. ​జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన 2 కేరన్​ను కలెక్టర్​ సందీప్​కుమార్​ఝా,  వరంగల్​లోని కాశీబుగ్గలో కలెక్టర్​ సత్యశారద.., జయశంకర్​భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన 5 కే రన్​ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జెండా ఊపి ప్రారంభించారు. 

టేకులపల్లిలో నిర్వహించిన 2 కే రన్​ను ఇల్లందు డీఎస్పీ వెంకన్నబాబు ప్రారంభించగా, జూలూరుపాడులో స్థానిక యువకులు, ఆఫీసర్లు, నాయకులు ప్రోగ్రామ్​లో పాల్గొన్నారు. అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ 2 కేరన్​ను  ప్రారంభించారు.

వెలుగు, నెట్​వర్క్​