కేసీఆర్ సర్కార్‌‌ను కూకటివేళ్లతో పెకిలించి వేయాలి 

కేసీఆర్ సర్కార్‌‌ను కూకటివేళ్లతో పెకిలించి వేయాలి 

కేసీఆర్ సర్కార్‌‌ను కూకటివేళ్లతో పెకిలించి వేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌‌ని ఓడగొట్టడానికి తాను రావాల్సిన అవసరం లేదని బండి సంజయ్ ఒక్కరే చాలన్నారు. కేవలం ఓ పార్టీని దించి మరో పార్టీని అధికారంలో తేవడానికో, ఒకరిని ముఖ్యమంత్రిని చేయడానికో కాదని ఆయన స్పష్టం చేశారు. మే 14వ తేదీ శనివారం తుక్కుగూడలో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బండి సంజయ్ పాదయాత్ర చేయడం లేదని..దళితులు వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం యాత్ర జరుగుతోందని తెలిపారు.

యాత్ర అందుకే :-
తెలంగాణలో నిజాంను మార్చేందుకు చేస్తోన్న యాత్రగా అభివర్ణించారు. రజాకార్ల ప్రతినిధుల ఒడిలో కూర్చున్న నేతలకు వ్యతిరేకంగా జరుగుతోందని, కుటుంబ పాలన కొనసాగిస్తున్న పాలనకు వ్యతిరేకంగా ఆయన పాదయాత్ర చేయడం జరుగుతోందన్నారు. వేలాది కోట్ల అవినీతికి పాల్పడిన టీఆర్ఎస్ ను కూకటి వేళ్లతో పెకిలించడానికి, మజ్లిస్ కి భయపడిన సీఎంను తొలగించేందుకు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దళితులను మోసం చేసిన టీఆర్ఎస్ తొలగించాలన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం చేస్తామని చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ముందస్తు ఎన్నికలు :-
ఎన్ని రోజులు ఫామ్ హౌజ్ లో ప్రణాళికలు రూపొందిస్తారని, ముందస్తు ఎన్నికలు జరిపించాలని అనుకొంటే.. . దమ్ముంటే రేపే ఎన్నికలు జరిపించాలని షా సవాల్ విసిరారు. ఎన్నికలు త్వరగా జరపాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు, తాము కూడా వాటి కోసమే ఎదురుచూస్తున్నామన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల నుంచి ధాన్యం కొంటామని, మతం ఆధారంగా రిజర్వేషన్లు ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీల్లో ఏర్పడిన కోతను తొలగించి రిజర్వేషన్లు కల్పిస్తామని హామీనిచ్చారు. టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు మంచి చెయ్యదని.. ఇక్కడ డబుల్ డెక్కర్ ప్రభుత్వం ఏర్పాటు చెయాలని మరోసారి సభలో పిలుపునిచ్చారు. మూడో దఫా యాత్ర జరిగినప్పుడు ఇంతకంటే భారీ సంఖ్యలో వచ్చి బండి సంజయ్ కి మద్దతివ్వాలని సూచించారు.

కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో :-
మజ్లిస్ కి భయపడి కశ్మీర్ లో 370 ఎత్తేసేందుకు వ్యతిరేకించిన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ విమోచనం దినోత్సవం నిర్వహిస్తామని హామీ ఇచ్చారని, అయినా ఇంత వరకు చేయడం లేదన్నారు. దీనికి కారణం చెప్పారు షా. మజ్లిస్ కి భయపడుతారని, వీరిద్దరినీ అధికారంలోంచి దించింతే బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సం నిర్వహిస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందని, ఇలాంటి ప్రభుత్వాన్ని మార్చేందుకే సంగ్రామ యాత్ర చేపట్టామన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇంకా అప్పులు కావాలని అడుగుతున్నారని.. కొడుకు కూతురు లబ్ధి చేకూర్చేందుకేనా ? అని సూటిగా ప్రశ్నించారు షా. 


 

45 డిగ్రీలు 760 కి.మీటర్లు :-
45 డిగ్రీల ఎండలో దాదాపు 760 కిలోమీటర్ల పాటు బండి సంజయ్ నడిచారని, ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనేందుకు 6359119119 నంబర్ కు మిస్ట్ కాల్ ఇవ్వాలని తెలిపారు. దీంతో బండి సంజయ్ కిలో మీటర్ల యాత్రకు మద్దతు లభించడమే కాకుండా బలం లభిస్తుందని తెలిపారు. హైదరాబాద్ జీహెచ్ హెంసీ (GHMC)ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారని... కానీ ఏ ఒక్కటీ నెరవేరలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ వెళ్లరని.. అక్కడకు వెళితే ప్రభుత్వం కూలుతుందని పండితుడు చెప్పడం వల్లనే అక్కడకు వెళ్లడని తెలిపారు. అయితే.. ఇప్పుడా అవసరం లేదని.. ఎందుకంటే తెలంగాణ ప్రజల వల్లే ప్రభుత్వం కూలుతుందని షా తెలిపారు. 



మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు
మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని..తర్వాత కావాల్సిన బడ్జెట్ లభిస్తుందన్నారు. దీనిద్వారా యువతకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. ఇది కేవలం బీజేపీ ద్వారా మాత్రమే సాధ్యమేనని మరోసారి స్పష్టం చేశారు. ఇక రైతుల విషయానికి వస్తే.. లక్షరూపాయల దాకా మాఫీ చేస్తామని చెపి అమలు చేయలేదన్నారు. ప్రతి జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డబులు బెడ్రూం ఇళ్లు విషయాన్ని గుర్తు చేశారు. దళితులకు బడ్జెట్ అని చెప్పి ఇంతవరకు అమలు కాలేదని విమర్శించారు. ప్రతి ఎస్సీ, ఎస్టీకి 3 ఎకరాల భూమి సంగతి ఏమైందన్నారు. 30 సెంటీమీటర్ల భూమి కూడా ఇవ్వలేదని, మోదీ పథకాల పేర్లు మార్చడం తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కేంద్ర పథకాలకు పేర్లు మార్చి కేసీఆర్, ఆయన కొడుకు ఫోటోలు అతికించుకుని ప్రచారం చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో నాలుగు సూపర్ స్పెషాలిటీ  హాస్పిటల్ కట్టాలి కానీ అవి కట్టకపోగా గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల పరిస్థితిని చెడగొట్టారని తెలిపారు. తన జీవితంలో ఇంత పనికిరాని అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని..ఈ ప్రభుత్వాన్ని కూలదోసి పడెయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

భారత ప్రభుత్వాన్ని దోషి చేయవద్దు...బీజేపీ కార్యకర్తలను హత్య చేస్తున్నారు :-
మోదీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చెయ్యదని చెబుతున్నారని,  మద్దతు ధర 1940 చేసిందన్నారు. 11 కోట్ల మంది చిన్న రైతులకు ప్రతి సంవత్సరం రూ. 6 వేలు అందిస్తోందన్నారు. భారత ప్రభుత్వాన్ని దోషిని చేసే ప్రయత్నం చేయకండని టీఆర్ఎస్ పార్టీ నేతలకు సూచించారు. ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, చేతకాకపోతే ప్రభుత్వం నుంచి తప్పుకోవాలన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. బీజేపీ తన సిద్ధాంతాలతో ప్రజల వద్దకు వెళ్తుందని, బీజేపీ కార్యకర్తలను పట్టపగలే హత్య చేస్తున్నారన్నారు. బెంగాల్ తెలంగాణ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిని ఆపాలని పిలుపునిచ్చారు. సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని.. ఈ ఘటనలో ఉన్న నేరస్థులను కఠినంగా శిక్షిస్తామన్నారు. 

ప్రజలు అన్నీ గమనిస్తున్నారు :-
తెలంగాణ ప్రజలకు తెలియదని కేసీఆర్ అనుకుంటున్నారు.. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆసక్తి లేదన్నారు. ఎందుకంటే వాటిలో ఆయన కాంట్రాక్టులు ఉండటం లేదని.. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 సంవత్సరాల్లో  2 లక్షల 50 వేల కోట్లు తెలంగాణ అభివృద్ధి కోసం ఇచ్చామని సభలో ప్రకటించారు. ఈ వివరాలన్నీ బండి సంజయ్ కి తాను ఇచ్చి వెళుతానని, ఈ వివరాలను ఆయన పీసీలో వివరిస్తారని నేతలకు తెలిపారు. తాము ఏమి ఇచ్చాం ? ఇక్కడి ప్రభుత్వం ఏమి చేసిందో తెలంగాణ ప్రజల ముందే చర్చిద్దామన్నారు కేంద్ర హోం మంత్రి షా. 

 

మరిన్ని వార్తల కోసం : 

బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా

కేసీఆర్ అంటే... కల్వకుంట్ల కమీషన్ రావు