ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో గద్దర్ భేటీ

ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో గద్దర్ భేటీ

నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవన్ కు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని, ఇందుకోసం ఒప్పించేందుకు అన్ని రాజకీయ పార్టీ నాయకులను కలుస్తున్నానని ప్రజా గాయకుడు గద్దర్ చెప్పారు. దీనిపైనే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను కలిసి విజ్ఞప్తి చేశానని చెప్పారు. సామాన్యుడి గుండె చప్పుడును గుర్తించే పార్టీ ఆప్ అని అన్నారు. ఆప్.. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉందని, దేశ ప్రజల్లో ఆ పార్టీపై చర్చ జరుగుతోందన్నారు. హైదరాబాద్ లిబర్టీ లోని ఆప్ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ ను గద్దర్ కలిశారు.

రాజకీయ లబ్ది పొందిన ప్రతి పార్టీ నూతన పార్లమెంట్ భవన్ కు అంబేడ్కర్ పేరును ప్రతిపాదించాలన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి నూతన పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టే వరకూ ఉద్యమిస్తామని గద్దర్ చెప్పారు.