సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో కాళోజీ బయోపిక్

సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో కాళోజీ బయోపిక్

తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జీవితం ఆధారంగా ప్రభాకర్ జైనీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’. టైటిల్ పాత్రలో కాళోజీగా మూలవిరాట్ నటించారు. విజయలక్ష్మీ జైనీ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 9న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ ‘పది సినిమాలకు సరిపడే కంటెంట్‌‌‌‌ ఆయన లైఫ్‌‌‌‌లో ఉంది. అందుకే కాళోజీ ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే అంశాలను తీసుకుని, వారి జీవితం నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమా తీశాం.

ఈ సినిమాకు ఏ సంస్థ గానీ, ప్రభుత్వం గానీ సహాయం చేయలేదు. కాళోజీ గారు జీవించిన, ఆయన తిరిగిన వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. అలాగే వైజాగ్‌‌‌‌లో ఓ సీన్ తీశాం. కాళోజీ గారు వాడిన కళ్ళజోడు, చేతి కర్రను ఇందులో ఉపయోగించాం. సినిమాలోని నాలుగు పాటల్లో కాళోజీ కవితల సారాంశాన్ని పొందుపరిచాం. ఒకటి గోరటి వెంకన్న, రెండోది వందేమాతరం శ్రీనివాస్, మరొకటి మాళవిక, భూదేవి పాడారు’ అని చెప్పారు.