- కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్టౌన్, వెలుగు: పారదర్శక పాలన కోసమే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్చెప్పారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో అధికారులతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజావాణికి మొత్తం 76 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు.
వాటిలో భూభారతి 36, ఇందిరమ్మ ఇళ్లు 8, పింఛన్లు 7, ఇతర సమస్యలు 25 ఉన్నాయన్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్నగేశ్, డీఆర్వో భుజంగరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్ రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి కి 25 దరఖాస్తులు
సంగారెడ్డి టౌన్: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో ప్రజల నుంచి 25 వినతులను స్వీకరించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, సంక్షేమ పథకాలు, మున్సిపల్ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులకు పంపిణీ చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు క్లియర్చేయాలన్నారు. ప్రజావాణి సమస్యలు పరిష్కరించే వేదికగా మార్చాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్వో పద్మజారాణి, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి , వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు .
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి
సిద్దిపేట టౌన్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ తెలిపారు. సిద్దిపేట కలెక్టరేట్ లో ఫిర్యాదుదారుల నుంచి 160 దరఖాస్తులను స్వీకరించినట్లు పేర్కొన్నారు. అనంతరం బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో నాగరాజమ్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
15 సార్లు అర్జీ ఇచ్చినా న్యాయం చేయడంలేదు
7 ఏండ్లుగా అధికారులు తనను తిప్పుతున్నారని15 సార్లు ప్రజావాణిలో అర్జీ ఇచ్చానా న్యాయం చేయడం లేదని సిద్దిపేట పట్టణానికి చెందిన నక్క నర్సింలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావాణిలో ఆయన మరో మారు అడిషనల్ కలెక్టర్ కు అర్జీని అందజేశారు.
అనంతరం మాట్లాడుతూ సిద్దిపేట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం అధికారులు 7 ఏండ్ల కింద తన 6 గుంటల స్థలం సేకరించారని, స్థలానికి బదులుగా ఇంటి నిర్మాణం కోసం 300 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వడంలేదన్నారు. ప్రజావాణిలో అధికారులు అర్జీలు స్వీకరిస్తున్నారు తప్ప న్యాయం మాత్రం చేయడం లేదని వాపోయారు.
