ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ

 ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ

యాదాద్రి, నల్గొండ అర్బన్, సూర్యాపేట కలెక్టరేట్, వెలుగు : ప్రజావాణి కార్యక్రమానికి దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. సోమవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆయా కలెక్టరేట్లలో నిర్వహించిన ప్రజావాణి అర్జీదారులు భారీగా తరలిచ్చి అధికారులకు సమస్యలను వివరించారు. సూర్యాపేట జిల్లా నుంచి ప్రజావాణిలో మొత్తం 146 దరఖాస్తులు వచ్చాయి. 

నల్గొండ జిల్లా నుంచి 130 దరఖాస్తులు రాగా, యాదాద్రి జిల్లా నుంచి 81 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆయా దరఖాస్తులను కలెక్టర్లు, అడిషనల్​కలెక్టర్లు స్వీకరించారు. అనంతరం ఆయా శాఖలకు చెందిన అధికారులకు దరఖాస్తులను ఫార్వర్డ్​చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.