జీహెచ్ఎంసీలో ప్రజావాణి ప్రారంభం

జీహెచ్ఎంసీలో ప్రజావాణి ప్రారంభం

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజావాణి కార్యక్రమం జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఇవాళ ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ కారణంగా తాత్కాలికంగా వాయిదా పడ్డ ఈ ప్రోగ్రామ్.. కోడ్ ముగియడంతో తిరిగి స్టార్ట్ అయింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణిని ప్రారంభించారు   ఇన్ ఛార్జ్ కమిషనర్ అమ్రపాలి   మూడున్నర నెలల తర్వాత ప్రజావాణి కార్యక్రమం తిరిగి ప్రారంభం కావడంతో పెద్దసంఖ్యలో అర్జీదారులు ప్రజాభవన్ కు చేరుకున్నారు.

  ప్రజావాణి కార్యక్రమానికి ఇన్ ఛార్జ్ కమిషనర్ అమ్రపాలితో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. హెడ్ ఆఫీస్ తో పాటు ఆరు జోన్లుగా, 30 సర్కిల్స్ కార్యాలయాల్లోనూ ఇవాళ్టి నుంచి ప్రజావాణి కార్యక్రమం నడుస్తుందని తెలిపారు. ప్రజల నుంచి పలు ఫిర్యాదులు అందుకున్నారు కమిషనర్, జీహెచ్ఎంసీ అధికారులు.