రాష్ట్రానికి భారీగా నిధులు: రూ.3 వేల 110 కోట్లిచ్చిన కేంద్రం

రాష్ట్రానికి భారీగా నిధులు: రూ.3 వేల 110 కోట్లిచ్చిన కేంద్రం

రాష్ట్రానికి  భారీగా  కాంపా నిధులు ఇచ్చింది  కేంద్రం. మొదటి సారిగా 3 వేల 110 కోట్ల నిధులు ఇచ్చింది.  ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇంద్రకరణ్ రెడ్డికి చెక్కు అందజేశారు ప్రకాశ్ జవదేకర్.  అటవీ అభివృద్ధికి రాష్ట్రం చేస్తున్న కృషిని అభినందించారు. అయితే ఈ నిధులను జీతాలు చెల్లించేందుకు, ఇతర ఖర్చులకు వాడొద్దని చెప్పారు. కేవలం అడవుల అభివృద్ధి, వన్యప్రాణుల సంరక్షణకు వాడాలని చెప్పారు. తెలంగాణతో పాటే.. మిగితా రాష్ట్రాలకు 47 వేల 436 కోట్లు విడుదల చేసింది కేంద్ర సర్కార్.

రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… కాంపా నిధుల్లో భాగంగా.. రాష్ట్రానికి 3 వేల 110కోట్లు ఇచ్చిందని చెప్పారు.  ప్రత్యామ్నాయ అడవుల పెంపకానికి గతంలో ఇచ్చిన నిధులను సమర్థవంతంగా వినియోగించడం వల్లే.. నిధులు ఇచ్చారన్నారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు రాష్ట్రానికి రావడం ఇదేమొదటిసారని.. హరిత హారానికి మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు ఇంద్రకరణ్ రెడ్డి. ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాష్ట్రం తరుపున ఇంద్రకరణ్ రెడ్డితో పాటు.. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.