2023 ఎన్నికల్లో TRS తో యుద్ధమే

V6 Velugu Posted on Sep 21, 2021

తెలంగాణలో ప్రజా పాలన నడవడం లేదు.. కేవలం కుటుంబ పాలన నడుస్తోందన్నారు కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్. హుజరాబాద్ ఎన్నికల్లో బీజేపీదే విజయం అని స్పష్టం చేశారు. అంతేకాదు 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ తో యుద్ధం తప్పదని తేల్చి చెప్పారు. 

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేస్తున్న ప్రజాసంగ్రామ యాత్రలో ఇవాళ ప్రకాశ్ జవదేకర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. బండి సంజయ్ చేపడుతున్న ప్రజాసంగ్రామ యాత్ర తెలంగాణ రాష్ట్ర గతిని మార్చివేస్తుందని స్పష్టం చేశారు. సీఎం పీఠం ఎక్కగానే కేసీఆర్  హామీలు మర్చిపోయారని విమర్శించారు.

ఏడేళ్ల పాలనలో ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ ప్రజల్ని మభ్యపెడుతోన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని పిలుపునిచ్చారు. లక్షమంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేశారని.. వారి ఖాళీలను ఎక్కడ భర్తీ చేశారని నిలదీశారు. తెలంగాణలో ఏ వర్గానికి న్యాయం జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు ప్రకాశ్ జవదేకర్.

Tagged Prakash Javdekar, TRS, 2023 elections, will fight

Latest Videos

Subscribe Now

More News