సిడ్నీ: ఇండియా స్టార్ షట్లర్ హెచ్. ఎస్. ప్రణయ్ తో పాటు సమీర్ వర్మ, సిక్కిరెడ్డి–సుమీత్ రెడ్డి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో ఐదోసీడ్ ప్రణయ్ 21–10, 23–21తో యోగోర్ కొయెల్హో (బ్రెజిల్)పై గెలవగా, సమీర్ 21–10, 21–10తో రికీ టాంగ్ (ఆస్ట్రేలియా)పై, కిరణ్ జార్జ్ 21–17, 21–10తో షియోడాంగ్ షెంగ్ (కెనడా)పై నెగ్గారు.
ఇతర మ్యాచ్‌ల్లో మిథున్, రఘు, శంకర్, అభిషేక్ ఓడిపోయారు. విమెన్స్ సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్ 21–14, 21–11తో బురోవా (ఉక్రెయిన్)పై, మాళవిక 21–10, 8–21తో తోటి షట్లర్ కెయూరపై గెలవగా, సామియా ఇమాద్ 23–21, 13–21, 22–24తో పాయ్ యు పో (చైనీస్‌తైపీ) చేతిలో పోరాడి ఓడింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–సిక్కి రెడ్డి 21–17, 21–19తో వాంగ్ టిన్ సి–లిమ్ సియాన్ (మలేసియా)పై గెలిచారు. మరో మ్యాచ్‌లో కోనా తరుణ్–శ్రీ కృష్ణ ప్రియ 6–21, 11–21తో హు పాంగ్ రోన్–చెంగ్ సు యిన్ (మలేసియా) చేతిలో పరాజయం చవి చూశారు.