
సుహాస్ హీరోగా అర్జున్ వై కె దర్శకత్వంలో జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ప్రసన్న వదనం’. పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్స్. మే3న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా బుధవారం ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. సుహాస్ మాట్లాడుతూ ‘ఫస్ట్ కాపీ చూసి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సినిమా థౌజండ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్. ఇందులో డౌట్ లేదు. ప్రేక్షకులకు చాలా తృప్తిని ఇచ్చే సినిమా ఇది. నా సినిమాలు మౌత్ టాక్‌తోనే బాగా ఆడతాయి. నా సక్సెస్‌ల విషయంలో క్రెడిట్ అంతా దర్శకులకే ఇస్తా.
ఈ సినిమా కూడా బాగా రన్ అవుతుందని భావిస్తున్నా’ అని అన్నాడు. ఇందులో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చెప్పింది రాశీ సింగ్. పక్కింటి అమ్మాయిలా కనిపించే పాత్ర చేశానంది పాయల్ రాధాకృష్ణ. డైరెక్టర్ అర్జున్ మాట్లాడుతూ ‘ఫేస్ బ్లైండ్‌నెస్ అనే యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందించాం. ఫన్, థ్రిల్, రొమాన్స్, ఎమోషన్స్ సహా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి’ అని చెప్పాడు. నిర్మాతలు మాట్లాడుతూ ‘ఈ సినిమా పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్. ఆడియెన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. బిజినెస్ పరంగా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు థియేటర్‌లో వచ్చేదంతా మాకు బోనస్సే’ అని చెప్పారు.