ముంబై: వీబీ జీ రామ్ జీ బిల్లుతో ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు ముగింపు పలికిందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. పేరుతో పాటు స్కీమ్ మొత్తాన్ని మార్చేశారని తెలిపారు.
ఈ మేరకు ఆదివారం లాతూర్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. “ఉపాధి హామీ స్కీమ్ అనేది హక్కు ఆధారిత పథకం. ఇందులో ప్రతి గ్రామీణ కుటుంబానికి 100 రోజుల పని కల్పించడంతో పాటు కనీస వేతనాన్ని అందించడం ప్రాథమిక హక్కుగా ఉండేది.
ఇప్పుడు కేంద్రం దాన్ని తొలగించి బడ్జెట్ ఆధారంగా ఉంటుందని చెప్పి దీనిని దాదాపుగా దాదాపు ముగించేసింది” అని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు.
