పోలింగ్ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలి: ప్రశాంత్ జీవన్ పాటిల్

పోలింగ్ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలి: ప్రశాంత్ జీవన్ పాటిల్

సిద్దిపేట రూరల్, వెలుగు: పోలింగ్ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. శుక్రవారం కలెక్టర్ ఆఫీస్​లో ఎన్నికల రిసోర్స్ పర్సన్స్ కు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే ప్రతి ఒక్క అధికారికి  విధుల పట్ల పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలన్నారు. ఎన్నికల సంఘం  నిబంధనల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంల మొదటి రాండమైజేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు.

జిల్లాలోని 4 అసెంబ్లీ స్థానాల పోలింగ్ కేంద్రాలకు అదనంగా 25% బ్యాలెన్సింగ్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లను, 40% వీవీ ప్యాట్లను కేటాయించామన్నారు.  ఓటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు voters.eci.gov.in వెబ్​సైట్​ని సందర్శించి తెలుసుకోవచ్చన్నారు.  కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎలక్షన్ సూపరింటెండెంట్​ రామేశ్వర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు మోహన్ లాల్, ఎండీ ఇమాముద్దీన్, శ్రీనివాస్, ఎండీ మునీర్,  యాదగిరి పాల్గొన్నారు.