పాట్నా/కోల్‌కతా: జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఆయన తన సొంత రాష్ట్రం బిహార్‌తో పాటు పక్కనే ఉన్న బెంగాల్‌లో కూడా ఓటు హక్కు కలిగి ఉన్నారు. దీంతో అతనికి బిహార్‌లోని రోహ్తాస్లో గల జిల్లా ఎన్నికల కార్యాలయం నోటీసు జారీ చేసింది. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది.
ప్రశాంత్ కిశోర్ బిహార్‌లోని కార్గహర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకున్నారు. అలాగే, బెంగాల్‌లో ఆ రాష్ట్ర సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న కోల్‌కతాలోని భబానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ప్రశాంత్ కిశోర్‌కు ఓటు హక్కు ఉంది. తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం చిరునామా 121, కాళీఘాట్ రోడ్‌లో ఓటరుగా నమోదు చేసుకున్నారని బెంగాల్ ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు.
