ప్రవళిక సూసైడ్ ఘటన.. పొలిటికల్ లీడర్స్, స్టూడెంట్స్పై కేసు నమోదు

ప్రవళిక సూసైడ్ ఘటన.. పొలిటికల్ లీడర్స్, స్టూడెంట్స్పై కేసు నమోదు

ప్రవళిక సూసైడ్ ఘటనలో పలువురు రాజకీయ నాయకులు, విద్యార్థి నాయకులపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  ఇటీవల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న  ప్రవళిక.. తను ఉంటున్న ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్ లోని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.  ప్రవళిక ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలిసి ఘటనాస్థలానికి భారీగా విద్యార్థులు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. అయితే, విద్యార్థులకు మద్దతూగా అక్కడికి చేరుకున్న పొలిటికల్ లీడర్స్, స్టూడెంట్ లీడర్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Also Read :- ఈసారి తెలంగాణలో రికార్డు బ్రేక్

ప్రవళిక..  వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు తాజాగా వీడియోలు రిలీజ్ చేసి తమకు న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ప్రభుత్వం వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ  ప్రవళిక సూసైడ్ చేసుకున్న రోజు ధర్నా చేసిన..  బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఓయూ జేఏసీ చైర్మన్ సురేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్, అనిల్ కుమార్, బీజేవైఎం నాయకులు భాను ప్రకాష్ లపై ఐపీసీ సెక్షన్ 143,148, 341, 332, r/w 149 సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీసులు  కేసు నమోదు చేశారు.