కూటి కోసం తిప్పలెన్నో.. సేఫ్టీ కిట్స్​లేకుండానే మ్యాన్‌‌హోల్స్​ క్లీనింగ్​

కూటి కోసం తిప్పలెన్నో.. సేఫ్టీ కిట్స్​లేకుండానే మ్యాన్‌‌హోల్స్​ క్లీనింగ్​

బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ రూమ్ సమీపంలో ఓ మ్యాన్​హోల్ గత ఐదారు రోజులుగా పొంగిపొర్లుతూ దుర్వాసన వెదజల్లుతోంది. సమస్య తీవ్రతరం కావడంతో స్థానిక ఇంటి యజమాని సొంత ఖర్చుతో ప్రైవేట్ కూలీని నియమించి క్లీన్ చేయించాడు. ఈ సమయంలో కూలీ ఎలాంటి సేఫ్టీ కిట్స్​లేకుండానే మ్యాన్‌‌హోల్‌‌లోకి దిగి, తల భాగం వరకు పైకి ఉంచుకుని చేతులతో చెత్తను తొలగించాడు.