
హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు స్పెషల్ ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నట్టు ప్రైవేట్ స్కూల్స్ అండ్ చిల్ర్డెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (పీఎస్సీడబ్ల్యూఏ) జాతీయ అధ్యక్షుడు షామిల్ అహ్మద్ తెలిపారు. శనివారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. భారత స్కిల్ డెవలప్ మెంట్ మంత్రిత్వ శాఖ సహకారంతో రాష్ట్రంలో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) సహాకారంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వెల్లడించారు. విద్యార్థులకు ఈ తరం పద్ధతులకు అనుగుణంగా బోధించేందుకు ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుందని చెప్పారు.