IPL ఆడుతూనే.. పరీక్షలకు హాజరు

 IPL ఆడుతూనే.. పరీక్షలకు హాజరు

మంచి క్రికెటర్ అనిపించుకోవాలంటే ఇండియాలో IPL ఓ మంచి వేదిక. 11 సంవత్సరాలుగా ఉంతో మంది యంగ్ ప్లేయర్స్ IPL నుంచే ఎదిగారు. ఈ సారి అలాగే వచ్చాడు యంగ్ ప్లేయర్ ప్రయాస్ బర్మన్. పదహారేళ్లకే IPLలో అడుగుపెట్టి  అత్యంత తక్కువ వయసు ఉన్నవాడిగా రికార్డు సృష్టించాడు ప్రయాస్‌ బర్మన్‌. ప్రస్తుతం CBSE 12వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. కోల్‌ కతాలోని కల్యాణి పబ్లిక్‌ స్కూల్‌ లో చదువుతున్నాడు. ఇటీవల అర్థశాస్త్రం పరీక్ష రాశాడు. ఏప్రిల్‌ 4న ఎంటర్‌ ప్రెన్యూర్‌ షిప్‌ పరీక్ష రాయనున్నాడు.

అయితే ఏప్రిల్‌ 2న రాజస్థాన్‌ తో, ఏప్రిల్‌ 5న కోల్‌కతాతో బెంగళూరు తలపడనుంది. పరీక్ష రాసిన మరుసటి రోజు మళ్లీ టీమ్ తో కలుస్తాడని ప్రయాస్‌ తండ్రి కౌశిక్‌ బర్మన్‌ తెలిపాడు. ప్రయాస్‌ కు బెంగళూరు టీమ్ నుంచి మంచి సహకారం ఉందని ఆయన తెలిపాడు. కోచ్‌ గ్యారీ కిర్‌ స్టెన్‌, కెప్టెన్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రయాస్‌ ను నెట్స్‌ లో ప్రోత్సహిస్తున్నారన్నాడు. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తో ఆదివారం జరిగిన మ్యాచ్‌ లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున తన ఫస్ట్ మ్యాచ్‌ ఆడాడు. ఆ మ్యాచ్‌ లో ప్రయాస్‌ వికెట్లేమీ తీయకుండా 56 పరుగులు సమర్పించుకున్నాడు. మరి రాబోయే మ్యాచుల్లో ఎలా రాణిస్తాడా ఈ యంగ్ స్టర్ చూడాలంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.