త్వరలో పీఆర్సీ కమిషన్‌‌‌‌ను ఏర్పాటు చేస్తం : మంత్రి కేటీఆర్

త్వరలో పీఆర్సీ కమిషన్‌‌‌‌ను ఏర్పాటు చేస్తం :  మంత్రి కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: పీఆర్సీ కమిషన్‌‌‌‌ ఏర్పాటు, మధ్యంతర భృతిని( ఐఆర్) సీఎం త్వరలోనే ప్రకటిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. గురువారం ఆయనను ప్రగతి భవన్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో టీఎన్జీవో  అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, సత్యనారాయణ గౌడ్ కలిశారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, ఐఆర్ ను ప్రకటించాలని కేటీఆర్ ను కోరారు. ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని..317 జీవోతో తలెత్తిన ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ర్టంలో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియమకాలను వెంటనే చేపట్టాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. 

సీఎంతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యేలా చొరవ చూపిస్తానని టీఎన్జీవో నేతలకు హామీ ఇచ్చారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, ఐఆర్ అంశాలపై సీఎం ప్రకటన చేస్తారని చెప్పారు. ఉద్యోగుల హెల్త్ ట్రీట్మెంట్ కు సంబంధించి ఈహెచ్ఎస్ స్కీమ్ రెడీ అయినట్లు తెలియజేశారు. కారుణ్య నియమకాలకు సంబంధించి సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయాలని టీఎన్జీవో నేతల ముందే సీఎస్ ను మంత్రి కేటీఆర్ ఫోన్ లో ఆదేశించారు. గచ్చిబౌలి హౌసింగ్​సొసైటీకి సంబంధించిన భూ సమస్య పెండింగ్​లో ఉందని..ఈ భూమిని ఉద్యోగులకు పంచేందుకు సీఎంతో చర్చిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. స్వరాష్ట్రంలో  ఏ ఉద్యోగికి అన్యాయం జరగదని, త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు తీపి కబురు వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.

కేటీఆర్​తో తమిళనాడు ఐటీ బృందం భేటీ

తెలంగాణ ఐటీ శాఖ పాలసీ స్టడీ చేయడానికి తమిళనాడు ఐటీ మినిస్టర్ పళనివేల్ త్యాగరాజన్ (పీటీఆర్) నేతృత్వంలోని ప్రతినిధి బృందం మూడు రోజుల పర్యటన కోసం గురువారం హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా సెక్రటేరియెట్​లో మంత్రి కేటీఆర్​తో తమిళనాడు టీమ్ భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ఐటీ పాలసీ, అనుబంధ పాలసీలు, ఇండస్ట్రీ బలోపేతం కోసం చేపట్టిన చర్యలపై కేటీఆర్ పవర్​పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.