బుద్వేల్ ప్లాట్ల వేలంపై ప్రీ బిడ్ మీటింగ్ .. ఎకరా కనీస ధర రూ.20 కోట్లు

బుద్వేల్ ప్లాట్ల వేలంపై  ప్రీ బిడ్ మీటింగ్ .. ఎకరా కనీస ధర రూ.20 కోట్లు

హైదరాబాద్, వెలుగు: బుద్వేల్​లో  వేలం నిర్వ హించనున్న ప్లాట్లకు ఆదివారం హెచ్ఎండీఏ ప్రీ బిడ్ మీటింగ్​ నిర్వహించింది. 182 ఎకరాల ల్యాండ్​లో  ప్రస్తుతం 100 ఎకరాలు వేలం వేస్తున్నట్లు ఇటీవల హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం బుద్వేల్  లే అవుట్​లో కేవలం 14 ప్లాట్లకు హెచ్ఎండీఏ వేలం నిర్వహించనుంది. ఇక్కడి లేఅవుట్​లో ప్లాట్ సైజులు కనీసం 3.47 ఎకరాలు, గరిష్టం 14.3 ఎకరాలుగా ఉన్నాయి. ఈ నెల 10న వేలం పాట జరగనుంది. ఎకరా కనీస ధరను హెచ్ఎండీఏ రూ.20 కోట్లుగా నిర్ణయించింది.  టీ - హబ్​లో హెచ్ఎండీఏ  నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశానికి హైదరాబాద్​లోని బిల్డర్లు, కన్ స్ట్రక్షన్​కంపెనీలతో పాటు దేశంలోని బడా రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.