బ్రహ్మాస్త్రం ప్రీ రిలీజ్ వేడుకలు రద్దు

బ్రహ్మాస్త్రం ప్రీ రిలీజ్ వేడుకలు రద్దు

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, అలియా భట్ జోడిగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, వీడియో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరిట సెప్టెంబర్ 09న రిలీజ్ చేయనున్నామని చిత్ర యూనిట్ పేర్కొంది. అంతకంటే ముందు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని తలపెట్టింది. ఈవెంట్ కు టాలీవుడ్ యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ హాజరు కాబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది.

రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించాలని భావించారు. కానీ అనుకోని కారణాల వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఈ విషయాన్ని Shreyas Media ట్వీట్ చేసింది. ఈవెంట్ రద్దు అయ్యిందని.. అభిమానులు సహకరించాలని కోరింది. ఉత్కంఠగా ఎదురు చూసిన అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌని రాయ్, డింపుల్ కపాడియాలు కీలక పాత్రల్లో నటించారు. దర్శక ధీరుడు రాజమౌళి తెలుగులో సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.  సినిమాని 2022 సెప్టెంబర్ 9న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.