అంగన్వాడీ టీచర్లకు ప్రీ స్కూల్ ట్రైనింగ్

అంగన్వాడీ టీచర్లకు ప్రీ స్కూల్ ట్రైనింగ్

సత్తుపల్లి, వెలుగు: సత్తుపల్లి ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు మంగళవారం ప్రీస్కూల్ పై ట్రైనింగ్ నిర్వహించారు. సుమారు 167 మంది అంగన్వాడీ టీచర్లకు సీడీపీవో మెహరున్నీసా బేగం పలు అంశాలపై సూచనలు చేశారు. 

వీరిని రెండు బ్యాచ్ లుగా డివైడ్ చేసి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో సూపర్​వైజర్లు గంగాజలం, వసంత, రాణి, భవాని, మహాలక్ష్మి, కమల, రజిని, రమాదేవి, ప్రసాద్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.