ప్రెషర్‌‌ బాంబ్‌‌ పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు..చత్తీస్‌‌గఢ్‌‌లో ఘటన

ప్రెషర్‌‌ బాంబ్‌‌ పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు..చత్తీస్‌‌గఢ్‌‌లో ఘటన

భద్రాచలం / తాడ్వాయి, వెలుగు : మావోయిస్టులు అమర్చిన ప్రెషర్‌‌ బాంబ్‌‌ పేలి ఇద్దరు సీఆర్‌‌పీఎఫ్‌‌ జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో గురువారం జరిగింది. ఎస్పీ గౌరవ్‌‌రాయ్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... సీఆర్‌‌పీఎఫ్‌‌ 195 బెటాలియన్‌‌కు చెందిన జవాన్లు గురువారం మాలేవాహి పోలీస్‌‌స్టేషన్‌‌ పరిధిలోని సాత్‌‌ధార్‌‌, మాలేవాహి గ్రామాల మధ్య కూంబింగ్‌‌ చేస్తున్నారు. ఈ క్రమంలో రోడ్లపై తనిఖీలు చేస్తుండగా... మావోయిస్టులు అమర్చిన ప్రెషర్‌‌ బాంబ్‌‌ ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి ఇన్స్‌‌పెక్టర్‌‌ దీవాన్‌‌ సింహ్, కానిస్టేబుల్‌‌ ఆలం మునేశ్‌‌ తీవ్రంగా గాయపడ్డారు. మిగతా జవాన్లు వారిని దంతెవాడ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మునేశ్‌ ములుగు జిల్లా తాడ్వాయి మండలం పంబాపూర్‌ గ్రామానికి చెందిన వ్యక్తి అని ఆఫీసర్లు తెలిపారు.