ఎక్కువ సేపు మాస్క్​ పెట్టుకుంటే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎక్కువ సేపు మాస్క్​ పెట్టుకుంటే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వ్యాక్సినేషన్​, కొవిడ్​ గైడ్​లైన్స్​ పాటించడం కరోనా నుంచి రక్షించుకునే మార్గాలు. అన్నీ బాగానే ఉన్నా.. ఎక్కువ కాలం మాస్కులు తొడగడం వల్ల  ఇబ్బందులు వస్తున్నాయనే కంప్లయింట్స్​ ఈ మధ్య పెరుగుతున్నట్టు డాక్టర్ల రిపోర్టులు చెబుతున్నాయి.  అయితే  మాస్క్​  తప్పకుండా వాడాలి.  కానీ, కొన్ని జాగ్రత్తలతో వాడితే ఈ సమస్యలను తప్పించుకోవచ్చంటున్నారు ఎక్స్​పర్ట్స్​. 

  • మాస్క్​ ఎక్కువ సేపు వాడటం వల్ల  తలనొప్పి, డీహైడ్రేషన్​,  అసౌకర్యం, అలర్జీ వంటి వాటి బారిన పడుతున్నామని చాలామంది చెబుతున్నారు. వాటికి  కొన్ని జాగ్రత్తలు  తీసుకుంటే చాలంటున్నారు డాక్టర్లు. 
  •   టైట్​గా ఉన్న మాస్క్​ పెట్టుకోవద్దు.  టైట్​ మాస్కులు చెవి దగ్గర  నరాలను ఇబ్బంది పెడతాయి.  దాని వల్ల తలనొప్పి వచ్చే  అవకాశముంది.
  • ఎక్కువ కాలం  మాస్క్​ ధరించడం వల్ల టెంపోరోమ్యాండిబ్యులర్ జాయింట్ (టీఎంజే– తలలో రెండు చెవుల మధ్య ఉండే జాయింట్​) లో నొప్పి పుడుతుంది.  ఈ జాయింట్​తోనే దవడ కదులుతుంది. చెవుల దగ్గర నరాలు టైట్​ అయితే ఫస్ట్​ ఎఫెక్ట్​ అయ్యేది ఈ జాయింటే.   దాంతో తలనొప్పి వస్తుంది.
  • మాస్క్​ పెట్టుకొని గంటలు గంటలు  ఉంచుకోవద్దు.  అప్పుడప్పుడు నోరు  తెరుస్తుండాలి. నెమ్మదిగా నోటిని  తెరుస్తూ, మూస్తూ  చిన్నపాటి మౌత్​ ఎక్సర్​సైజ్​లా చేయాలి.
  • జలుబు, దగ్గు, ఆస్తమా, అలర్జీలు, స్కిన్​ అలర్జీలు ఉన్న వాళ్లకి  మాస్క్ పెట్టుకోవడం కొంత కష్టంగా ఉంటుంది.  వాళ్లు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ పెట్టుకున్నా దవడలు, నోటికి పని చెప్పాలి.  అప్పుడప్పుడు దవడల్ని  కదిలిస్తుండాలి.
  • సర్జికల్​ మాస్క్​లు  పెట్టుకొని బయటకు వెళ్తే ఇంటికొచ్చాక వాటిని పారేయాలి.  మళ్లీ మళ్లీ వాడొద్దు. వాటి మీద ఎక్కువ దుమ్ము, ధూళి పేరుకు పోయే ప్రమాదం ఉంది.