
వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో కీలకమైన విషయాలు బయటకు వస్తున్నాయి. సూసైడ్ చేసుకునే ముందు రోజు సైఫ్ వేధింపులపై ఆమె తన తల్లితో మాట్లాడిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ఫోన్ కాల్లో తన బాధను తల్లితో ప్రీతి చెప్పుకుంది. సైఫ్ వేధింపులు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని, అతనిపై ఫిర్యాదు చేస్తే సీనియర్లందరూ ఒకటై తనని దూరం పెడతారని ప్రీతి వాపోయింది. నాన్న పోలీసులతో ఫోన్ చేయించినా లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. తాను సైఫ్ తో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తానని ప్రీతి తల్లి తనతో చెప్పినట్టుగా ఆ ఆడియోలో ఉంది. ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు అంటున్నారు. ఇప్పటివరకు ఆమె గుండె ఆరు సార్లు ఆగిందని, సీపీఆర్ చేసి గుండె పనిచేసేలా చేశామని వైద్యులు తెలిపారు. 4 రోజులుగా వెంటిలేటర్, ఎక్మో యంత్రంతో చికిత్స అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు.